Tuesday, September 10, 2024
Homeచిత్ర ప్రభMagnum Opus ‘Billa Ranga Baasha’ Spectacular Concept: బిల్లా రంగ బాషాలో సుదీప్

Magnum Opus ‘Billa Ranga Baasha’ Spectacular Concept: బిల్లా రంగ బాషాలో సుదీప్

'విక్రాంత్‌ రోణ' కాంబో మరోసారి

సూపర్ స్టార్ బాద్ షా కిచ్చా సుదీప్, అనూప్ భండారి, నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ మాగ్నమ్ ఓపస్ ‘బిల్లా రంగ బాషా’ స్పెక్టక్యూలర్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్

- Advertisement -

సూపర్ స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారి బ్లాక్ బస్టర్ ‘విక్రాంత్‌ రోణ’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. హనుమాన్ తో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యూచర్ లో జరగబోయే కథను పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోతో పాటు ‘బిల్లా రంగ బాషా‘ అఫీషియల్ లోగో ని మేకర్స్ రివిల్ చేశారు. యూనిక్ అప్రోచ్ సినిమాలు చేయడంలో అనూప్ భండారి దిట్ట. ఈ వీడియో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.

కాన్సెప్ట్ వీడియో క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించి గ్లింప్స్ ని అందిస్తోంది. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, తాజ్ మహల్ స్మాస్ అయినట్లుగా చూపిస్తూ, ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా వుంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు, క్లైమాట్స్ యాడ్ చేశారు. అనూప్ భండారి ఎక్సయిటింగ్ డీటెయిల్స్ తో విజువల్ ప్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు.

ఈ కొలాబరేషన్ గురించి డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడుతూ, ‘విక్రాంత్‌ రోణ తర్వాత నిరంజన్ రెడ్డి నాతో కలిసి పనిచేయాలనుకున్నారు. మేము ఇంతకు ముందు హనుమాన్ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కలుసుకున్నాము. నా తర్వాతి చిత్రం కూడా బాద్‌షా కిచ్చా సుదీప్‌తోనే ఉంటుందని, బిల్లా రంగ బాషా కథాంశాన్ని, ఆ వరల్డ్ వివరించినప్పుడు ఆయన థ్రిల్ అయ్యారు. వారు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని కోరుకున్నారు. బిల్లా రంగ బాషా దీనికి పర్ఫెక్ట్. కిచ్చా సుదీప్‌తో జతకట్టడం గురించి అనూప్ మాట్లాడుతూ, ‘సుదీప్ సర్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ గొప్ప అనుభవం. ప్రజలు విక్రాంత్ రోనాను ఇష్టపడ్డారు. వారు దీన్ని మరింత ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సుదీప్ సార్ దీనిని తన బిగ్గెస్ట్ అని పిలవడం చాలా పెద్ద అభినందన, నా భుజాలపై పెద్ద బాధ్యత. అంచనాలని అందుకునేలా ఈ సినిమా వుంటుంది’ అన్నారు.

‘కిచ్చా సుదీప్‌తో అనూప్‌ భండారి సినిమా చేస్తున్నారని మొదట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. విక్రాంత్ రోనా తెలుగులో విజయవంతమైంది. ఈ కొలాబరేషన్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. బిల్లా రంగ బాషా కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలి అనే నమ్మకం కలిగింది. సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌తో సినిమా చేయడం గొప్ప అవకాశం. షూటింగ్‌ ప్రారంభం కావాలని, ప్రేక్షకులు బిల్లా రంగ బాషా ప్రపంచాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాం’ అని నిర్మాతలు తెలిపారు.

బిల్లా రంగ బాషా అన్ని ప్రధాన భారతీయ భాషలలో నిర్మాణమౌతుంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

https://drive.google.com/drive/folders/1S0lKz3R4f6en6jlXy1eBIujVfmRqwgAN

https://drive.google.com/drive/folders/1S0lKz3R4f6en6jlXy1eBIujVfmRqwgAN

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News