Rajamouli: మహేష్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న SSMB 29పై ఉన్న అంచనాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ సినిమా మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ క్రమంలో SSMB 29 డిజిటల్ రైట్స్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇంతకీ SSMB 29 డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏది? అనే వివరాలను ఇప్పుడు చూసేద్దాం…
పాన్ ఇండియా రేంజ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అభిమానులతో పాటు ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న సినిమా SSMB29. సూపర్‌స్టార్ మహేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న #SSMB29 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి! ఈ మెగా ప్రాజెక్ట్ గురించి చిన్న అప్‌డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, ఒరిస్సా వంటి ప్రాంతాల్లో చిత్రీకరణను పూర్తి చేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అదే.. SSMB 29 ఓటీటీ డీల్. ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే వారెంత రేటుకి ఓటీటీ హక్కులను దక్కించుకున్నారనే దానిపై మాత్రం ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. అయితే సినిమా సెట్స్ పై ఉండగానే ఈ డీల్ పూర్తి కావటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని భారీ చిత్రాలు పూర్తైనప్పటికీ ఓటీటీ డీల్ కుదరటం లేదు. మరో వైపు కొన్ని ఓటీటీ సంస్థలు ఫలానా డేట్‌కు సినిమాను రిలీజ్ చేస్తానంటేనే హక్కులను కొంటామనే కండీషన్స్ పెడుతున్నాయి. సమయం బాగోలేక రిలీజ్ డేట్ మారితే ఇక అంతే సంగతులు. డీల్‌లో మాట్లాడుకున్న మొత్తంలో కోత ఉంటుంది.
ఇలాంటి కండీషన్స్‌లో రాజమౌళి సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేరు. అలాంటిది ముందుగానే డిజిటల్ డీల్ క్లోజ్ కావటం అంటే మామూలు విషయం కాదు. మహేష్, రాజమౌళి సినిమాకున్న క్రేజ్ ముందు ఓటీటీ సంస్థ ఎలాంటి కండీషన్స్ పెట్టే అవకాశం ఉండకపోవచ్చునని సినీ సర్కిల్స్ అంటున్నాయి. SSMB 29ను జక్కన్న రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని టాక్. అందులో తొలి భాగం 2027లో రిలీజ్ అవుతుందని, సెకండ్ పార్ట్ పై ఇంకా క్లారిటీ లేదని అంటున్నారు.