Sitara Ghattamaneni First Remuneration: మహేష్‌బాబు కూతురు సితార ఘట్టమనేనికి సినిమా యాక్టర్లకు ధీటుగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఖాతాను రెండు మిలియన్లకుపైగా ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని, వ్యక్తిగత ఇష్టాలను ఫొటోలు, వీడియోల రూపంలో తరచుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
తండ్రితో యాడ్‌లో…
సితారకు ఉన్న పాపులారిటీ కారణంగా ఆమెతో యాడ్స్ చేసేందుకు పలు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆసక్తిని చూపుతున్నాయి. ఇప్పటికే తండ్రి మహేష్‌బాబుతో కలిసి పలు యాడ్స్‌లో నటించింది. 12 ఏళ్ల వయసులోనే జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకుగాను సితార కోటి రూపాయలకుపైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఛారిటీకి విరాళం…
తొలి రెమ్యూనరేషన్‌ను ఓ సేవా కార్యక్రమాల కోసం వినియోగించి గొప్ప మనసును చాటుకుంది సితార. కోటి రూపాయలను ఓ ఛారిటీ సంస్థకు విరాళంగా అందజేసిందట. రెమ్యూనరేషన్‌లో నుంచి ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోకుండా మొత్తాన్ని ఛారిటీకే ఇచ్చేసిందట. సేవా గుణంలో తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకున్నది.
మహేష్‌బాబు ఫౌండేషన్…
మహేష్‌బాబు సైతం సినిమాల్లో నటిస్తూనే సేవా కార్యక్రమాలతో అభిమానుల దృష్టిలో రియల్ హీరో అనిపించుకుంటున్నారు. మహేష్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు మహేష్ బాబు.
రాజమౌళితో అడ్వెంచరస్ థ్రిల్లర్…
ప్రస్తుతం రాజమౌళితో యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు మహేష్‌బాబు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. మహేష్‌బాబు, రాజమౌళి మూవీలో మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు దక్షిణాది, బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ…
ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే టాంజానియాలో మొదలుకాబోతున్నట్లు సమాచారం. టాంజానియాతో పాటు సౌతాఫ్రికా అడవుల్లో మహేష్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మూవీతోనే పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి మహేష్‌బాబు ఎంట్రీ ఇస్తున్నారు.


