Wednesday, November 12, 2025
Homeచిత్ర ప్రభKrishna Tribute event : అభిమానుల మధ్య ఎమోషనల్ అయిన మహేష్ బాబు..

Krishna Tribute event : అభిమానుల మధ్య ఎమోషనల్ అయిన మహేష్ బాబు..

- Advertisement -

Krishna Tribute event : ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, టాలీవుడ్, అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. నేడు కృష్ణ దశ దిన కర్మని ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రాబోతున్న ప్రముఖులు, అభిమానుల కోసం ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం, JRC కన్వెన్షన్ లో అభిమానుల కోసం ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ కార్యక్రమానికి 5000 మంది అభిమానులు వచ్చారు. అభిమానులు కృష్ణ కి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అభిమానుల మధ్య వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ.. ”నాకు నాన్న ఎన్నో ఇచ్చారు. వాటిల్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి నేను రుణపడి ఉంటాను. నాన్న గారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు, మీ గుండెల్లో ఉంటారు. ఆయన ఎప్పుడూ మన మధ్యే ఉంటారు. మీ అభిమానం, ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అని ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad