Tuesday, April 1, 2025
Homeచిత్ర ప్రభMahesh Babu: ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు: మహేశ్

Mahesh Babu: ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు: మహేశ్

Mahesh Babu: మహిళలపై అత్యాచారాలు, లింగ సమానత్వం కోసం ఏర్పాటుచేసిన ‘మార్డ్‌’ (Men Against Rape and Discrimination) కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు భాగస్వామి అయ్యారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ (Farhan Akhtar) తండ్రి, రచయిత జావేద్‌ అక్తర్‌ (Javed Akhtar) రాసిన కవిత తెలుగు వర్షన్‌ను ఆయన పాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

‘ఎవరి ప్రవర్తన మంచిగా ఉంటుందో..
ఎవరికి ఆడవారంటే గౌరవం ఉంటుందో..
ఎవరు మహిళల శరీరానికి, ఆత్మకు విలువనిస్తూ..
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరు మగువ కూడా మనిషేనని ఒక్క క్షణం కూడా మర్చిపోరో..
స్త్రీకి గుర్తింపు ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో..
ఎవరు పక్కన ఉంటే మహిళ ధైర్యంగా ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు. సహచరుడు, ఆత్మీయుడు.
ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు’’ అంటూ పాడారు.

‘గౌరవం, సానుభూతి మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణాలు. సమానత్వం కోసం నిలబడండి. ప్రతి పనిలోనూ దయను చూసేవాడు అసలైన పురుషుడు. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు నాతో పాటు మీరూ మార్డ్‌లో చేరండి’ అని తెలిపారు. కాగా మహేశ్‌తో పాటు క్రికెట్‌ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, గాయకుడు షాన్‌ మార్డ్(MARD) ప్రచారంలో భాగమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News