SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా అప్డేట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా, ఈ నెలలో మాత్రం ఫ్యాన్స్ కోసం ఒక పెద్ద పండుగ ప్లాన్ చేశాడు. ముఖ్యంగా నిన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ: Diwali Movies: ఓటీటీలో సినిమాల వర్షం.. ఒకే రోజు రిలీజ్!
సాధారణంగా సినిమాలకు పాటలు, ట్రైలర్‌ల కోసం ఈవెంట్లు పెడతారు. కానీ రాజమౌళి స్టైలే వేరు. ఆయన ఈ సినిమా టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేసేందుకే ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసాడు. ఈవెంట్ నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా జరగనుంది. దీనికోసం ఏకంగా 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తైన భారీ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇంత పెద్ద స్టేజ్‌పై ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.
ALSO READ: Satya: ఆల్‌రౌండర్ సత్య కమెడియన్ టు సోలో హీరో!
రాజమౌళి ఈ ఈవెంట్ లో ఒక సర్ప్రైజ్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది. ఈ మొత్తం కార్యక్రమం జియో హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఒక సినిమా టైటిల్, గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ ఇలా లైవ్‌లో రావడం కూడా ఒక రికార్డే అని అంటున్నారు. ‘గ్లోబ్ ట్రాటర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా… ఇండియన్ సినిమాలో ఎవరూ టచ్ చేయని జానర్‌లో ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ ప్రియాంక చోప్రాతో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. రాజమౌళి చెప్పినట్టుగా ఈ నవంబర్‌లో ఫ్యాన్స్ కి పెద్ద సర్ ప్రైజ్ ఉండబోతుంది.


