Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘వారణాసి’. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై విపరీతమైన బజ్ నెలకొంది. కేవలం ప్రకటనతో ఈ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక చిత్రం నుంచి వచ్చిన గ్లోబ్ ట్రాటర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. దీంతో వారణాసికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ అయినా ఫ్యాన్స్, ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది.
సైలెంట్ గా సెట్స్ కి
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రస్తుతం ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకి అదేంటంటే.. నిజానికి వారణాసి చిత్రం ఎప్పుడు సెట్స్‌కి వచ్చిందనేది కూడా క్లారిటీ లేదు. మూవీ ప్రకటన అయితే ఇచ్చారు.. కానీ, లాంచ్ ఈవెంట్, చిత్రీకరణకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. హడావుడి ఏం లేకుండ సైలెంట్‌గా సినిమాను సెట్స్‌లోకి తీసుకువచ్చాడు జక్కన్న. ఇది తెలిసి అంతా షాక్ అయ్యారు. సరే మెల్లిగా ఏదోక అప్‌డేట్ వదిలి ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తారనుకుంటే.. ఏకంగా గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్‌ని నిర్వహించారు.
హైదరాబాద్ లోనే షూటింగ్
కేవలం ఫస్ట్‌లుక్, టైటిల్ రివీల్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మించే స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఈవెంట్ ద్వారా మహేష్ లుక్‌తో పాటు ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేశాడు జక్కన్న. ఫస్ట్ లుక్‌కి ఈరేంజ్‌లో ఈవెంట్ చేయొచ్చని నిరూపిస్తూ గ్లోబ్ ట్రాటర్‌తో ట్రెండ్ సెట్ చేసింది వారణాసి టీం. ఈ దెబ్బతో మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. గ్లోబ్ ట్రాటర్ తర్వాత వారణాసికి సంబంధించి అప్‌డేట్, షూటింగ్ వివరాలు పెద్దగా బయటకు రావడం లేదు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వారణాషి చిత్రీకరణ హైదరాబాద్‌లోని శకంర్‌పల్లిలో జరుగుతోందట. ఈ షెడ్యూ్‌ల్‌లో మహేష్, ఫృథ్వీరాజ్‌తో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
80 శాతం షూటింగ్ పూర్తి
అక్కడ వీరి మధ్య జరిగే పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు టాక్. కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ తర్వాత మూవీ టీం చిన్న బ్రేక్ తీసుకోనుందా. ఈ విరామ సమయంలో మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రాజమౌళి కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లబోతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విరామం అనంతరం షూటింగ్ మళ్లీ మొదలవుతుంది. అయితే ఇప్పటి వరకు వారణాషి 80 శాతం పూర్తి చేసుకున్నట్టు సమాచారం. కాగా వారణాసి మూవీ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్ వేసిన సంగతి తెలిసిందే. కాశీ నగరాన్ని తలపించేలా భారీ సెట్‌ని నిర్మించి.. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కేవలం సినిమాలోని 25 నిమిసాల నిడివి కోసం అచ్చం కాశీ నగరంలోని గంగా హారతి, పురాతన ఆలయాలు, వారణాసి వీధులు తలపించేలా సెట్ రూపొందించాడు జక్కన్న.
Also Read: Dee Freeman: క్యాన్సర్‌తో ప్రముఖ నటి మృతి

