Homeచిత్ర ప్రభJailer 2: ఎట్టకేలకు 'జైలర్‌ 2' షూటింగ్‌ పూర్తి.. రిలీజ్‌ ఎప్పుడంటే!

Jailer 2: ఎట్టకేలకు ‘జైలర్‌ 2’ షూటింగ్‌ పూర్తి.. రిలీజ్‌ ఎప్పుడంటే!

Jailer 2 Shooting Wrapped Up: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌ 2’. గతంలో విడుదలైన జైలర్‌కి ఇది సీక్వెల్‌. తొలి పార్ట్‌ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దీంతో జైలర్‌ 2పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయ్యినట్టు తాజాగా మూవీ టీం ప్రకటించింది.

- Advertisement -

జైలర్ 2 షూటింగ్ పూర్తి
ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ అంత కేక్‌ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలను చిత్ర బృందం షేర్‌ చేసింది. జైలర్‌ 2 షూటింగ్‌ పూర్తవ్వడంతో అభిమానులంత పండగ చేసుకుంటున్నారు. మూవీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రజనీకాంత్‌ చివరి నటించని కూలీ చిత్రం ఎంతగా డిసప్పాయింట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఫస్ట్‌ డే భారీ ఓపెనింగ్స్‌ ఇచ్చిన ఈ చిత్రం ఆ తర్వాత మెల్లిమెల్లిగా వసూళ్లు తగ్గిపోయాయి.

రిలీజ్ ఎప్పుడు?
తమిళ్‌ ఇండస్ట్రీకి వెయ్యి కోట్ల చిత్రం అవుతుందనుకుంటే మినిమమ్‌ రిటర్న్స్‌ కూడా ఇవ్వలేకపోయింది కూలీ. ఇక కూలీ డిజాస్టర్‌ తర్వాత రజనీ వెంటనే జైలర్‌ 2 షూటింగ్‌ని మొదలపెట్టాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ పూర్తవ్వడం అభిమానులంత పోస్ట్‌ ప్రోడక్షన్, వర్క్‌ రిలీజ్‌ డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటి వరకు జైలర్‌ 2 రిలీజ్‌పై మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ షూటింగ్‌ కూడా అనుకున్నసమయం కంటే ముందుగానే పూర్తవ్వడంతో రిలీజ్‌ కూడా అతి త్వరనేలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి జైలర్‌ 2 రిలీజ్‌ అభిమానులం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరి రిలీజ్‌ డేట్‌పై మేకర్స్‌ ఎలాంటి అప్‌డేట్‌ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి సంతరించుకుంది.

Also Read: Allu Arjun: కుటుంబంతో సహా ముంబైకి బన్నీ మకాం.. అల్లు అరవింద్‌ ఏమన్నారంటే!

అనిరుధ్ సంగీతం
యంగ్‌ సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. పార్ట్‌ 1కి కూడా అనిరుధే సంగీత దర్శకుడిగా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌కి ఆయన ఇచ్చిన సంగీతం, బీజీఎం సంగీత ప్రియులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాని సన్‌ పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. అయితే ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తవడంతో ఇప్పుడు అందరి దృష్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు, రిలీజ్ డేట్‌పై ఉంది. రజనీకాంత్ స్టైల్, నెల్సన్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని సినీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News