EA Rajendran Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఈఏ రాజేంద్రన్ తీవ్ర అనారోగ్యంతో (71) కన్నుమూశారు. కేరళలోని కొల్లాం జిల్లా పట్టతానంలోని తన నివాసంలో మార్చి 26న తుదిశ్వాస విడిచారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తన ఆ తర్వాత మలయాళం సినీ ఇండస్ట్రీలోకి అడుపెట్టారు.
సినిమా, టీవీ రంగాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినీ కెరీర్‌లో దాదాపు 60 పైగా చిత్రాల్లో నటించారు. విలన్‌గా, సహాయక పాత్రలతో అభిమానులను మెప్పించిన ఆయన సీరియల్స్ నటించి బుల్లితెరపై రాణించారు. కేరళ త్రిస్సూర్ జిల్లాలో త్రితల్లూరులో జన్మించిన ఆయన చిన్న వయసులోనే కళలపై ఆసక్తి కనబరిచారు. పూణేలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెలివిజన్ కోర్సులో అభ్యసించిన ఆయన ప్రముక నటుడు మాధవన్ కుమార్తె సంధ్యను పెళ్లి చేసుకున్నారు.
వీఆర్ గోపీనాథ్ దర్శకత్వం వహించిన గ్రీష్మం చిత్రంతో రాజేంద్రన్ తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత రాజేంద్రన్‌కు సినిమారంగంలో అవకాశాలొచ్చాయి. జయరాజ్ దర్శకత్వం వహించిన కాళియాట్టం చిత్రంలోనూ నటించారు. అంతేకాకుండా ప్రణయ వర్ణంగల్, దయ, పట్టాభిషేకం వంటి మూవీస్‌లో కూడా కనిపించారు. అంతేకాకుండా రాష్ట్ర ఉద్యానవన సంస్థ అధ్యక్షుడిగానూ రాజేంద్రన్ సేవలందించారు.
Also Read: Daggubati Family Case: దగ్గబాటి ఫ్యామిలీపై కేసు.. క్లారిటీ ఇచ్చిన లీగల్ టీం

