Wednesday, January 14, 2026
Homeచిత్ర ప్రభChiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు హుక్ స్టెప్‌తో రఫ్ఫాడించారు

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు హుక్ స్టెప్‌తో రఫ్ఫాడించారు

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు హుక్ స్టెప్‌తో రఫ్ఫాడించారు. అవును.. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన హుక్ స్టెప్ సాంగ్‌తో అటు మెగా అభిమానులు ఇటు సినీ లవర్స్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. చిరు అంటే డాన్స్. ఆ తర్వాతే ఇంకేదైనా. కానీ, వయసు రిత్యా ఆయన కాస్త హెవీ మూవ్‌మెంట్స్ వేయడం లేదని ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు.

- Advertisement -

ఖైదీ నంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ సినిమాలో మంచి స్టెప్స్ వేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్, శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు చిరు గ్రేస్ గురించి ఇప్పటికీ షాకవుతుంటారు. ఇక, తాజాగా రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి వచ్చిన పాటలన్నీ యూట్యూబ్‌లో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ దాటి సంచనలం సృష్ఠించింది.

Also Read- Toxic Teaser: ‘రాయ‌’గా క‌న్న‌డ రాక్టింగ్ స్టార్ య‌ష్‌.. టీజ‌ర్ విడుద‌ల‌.. సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌

శశిరేఖ, మెగా విక్టరీ మాస్ సాంగ్ కూడా అదే రీతిలో ఆకట్టుకున్నాయి. అయితే చిరు సినిమాలో ఇంట్రో సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మన డాన్స్ మాస్టర్స్ ప్రత్యేకమైన స్టెప్పులను మెగాస్టార్ కోసం కంపోజ్ చేస్తుంటారు. అలాంటి సాంగ్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడు. ఆ సాంగే ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో మంటలు రేపుతున్న హుక్ స్టెప్ సాంగ్.

మెగాస్టార్‌లోని గ్రేస్ కి తగ్గట్టుగా ఈ హుక్ స్టెప్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి చాలా కాలం నుంచి చిరును మెగా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు భారీ కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందని అందరూ ఎంతో బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమా 300 కోట్లకి పైగానే గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా, ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించింది. ఓ సర్‌ప్రైజింగ్ రోల్‌ని వెంకటేష్ పోషించాడు.

Also Read- God Of War: గాడ్ ఆఫ్ వార్ క‌థ‌తో నాని, కిషోర్ తిరుమ‌ల మూవీ – త్రివిక్ర‌మ్‌తో పోటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News