Sunday, June 30, 2024
Homeచిత్ర ప్రభManchu Lakshmi: ఇది విన్నారా.. ట్రోల్స్ తగ్గిపోయాయని మంచు లక్ష్మి తెగ ఫీలైపోతోందట!

Manchu Lakshmi: ఇది విన్నారా.. ట్రోల్స్ తగ్గిపోయాయని మంచు లక్ష్మి తెగ ఫీలైపోతోందట!

- Advertisement -

Manchu Lakshmi : మంచు లక్ష్మి మీద ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి మాట్లాడే విధానం, తన సినిమాలు.. వీటిపై రెగ్యులర్ గా ఎక్కడో ఒకచోట ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల మంచు లక్ష్మి మీద ట్రోల్స్ తగ్గి మంచు విష్ణు మీద ట్రోల్స్ పెరిగాయి.

మంచు లక్ష్మి ఇటీవలే మలయాళంలో మోహన్ లాల్ సరసన మాన్‌స్టర్ సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో మంచులక్ష్మి తనపై వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడింది.

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను ఏమి మాట్లాడినా, ఏం చేసినా ట్రోల్ చేసేవారు. ఇప్పుడు నా మీద ట్రోల్స్ తగ్గిపోయాయి. ట్రోలర్స్ కి నేనే కావాలని స్టఫ్ ఇస్తాను. ఇండైరెక్ట్ గా ట్రోలర్స్ కి హింట్ ఇస్తాను. వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తే వాటిని చూసి సరదాగా ఎంజాయ్ చేస్తాను. నా మీద వచ్చే ట్రోల్స్ ని నేను సీరియస్ గా తీసుకోను అని తెలిపింది. దీంతో ట్రోలర్స్ మరోసారి మంచు విష్ణుని మీ అక్కని చూసి నేర్చుకో ట్రోల్స్ ని సరదాగా తీసుకోవాలని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News