Manchu Lakshmi Tweet to Trisha: ఈ రోజు సినీ హీరోయిన్ త్రిష కృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా నటి మంచు లక్ష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రిషకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే, ఈ ఏడాది ఆమెకు ఇది “డబుల్ సెలబ్రేషన్” అని లక్ష్మి ట్వీట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ భారీ విజయమే యూనివర్స్ మీకు ఇచ్చిన బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్” అని పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-expresses-joy-over-udfs-victory-in-keralam/
‘ఎవర్ గార్జియస్ అండ్ గ్రేస్‌ఫుల్ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైనది.’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. త్రిష పుట్టినరోజు, 2026 తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒకే రోజు రావడం, టీవీకే సంచలన విజయం సాధించడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Happy Birthday to the ever gorgeous and graceful @trishtrashers ! 🎂✨ What a day to celebrate! I guess the universe decided to give you the best birthday gift with that massive victory ! 🐯💥 Double celebrations for you today! Have a magical one, darling! 🥂💖…
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 4, 2026
పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష.. అనంతరం అక్కడి నుంచి చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత తొలిసారిగా పోటీ చేసిన ఎన్నికల్లోనే విజయం సాధించడంతో రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 234 స్థానాలకు గాను దాదాపు 109 స్థానాల్లో విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దుతు కోరతామని ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

