Homeచిత్ర ప్రభManchu Manoj: ధీన స్థితిలో దాసరి సమాధి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్‌

Manchu Manoj: ధీన స్థితిలో దాసరి సమాధి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్‌

Dasari Tomb manchu Manoj: తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ దర్శకుడు, ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై హీరో మంచు మనోజ్ వేగంగా స్పందించారు. తన బృందంతో కలిసి ఆ ప్రాంగణాన్ని స్వయంగా శుభ్రం చేయించారు. దాసరి వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక హృదయవిదారక వీడియోపై స్పందించిన మనోజ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/red-alert-for-several-districts-in-telangana/

దాసరి నారాయణరావు వర్ధంతి వేళ ఆయన సమాధి ప్రాంగణం పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో పాడుపడ్డ స్థితిలో ఉండటం చూసి టాలీవుడ్ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. శుక్రవారం మంచు మనోజ్‌ దృష్టికి ఈ వీడియో చేరడంతో చూసి చలించిపోయిన ఆయన.. ఆ సమాధిని తానే శుభ్రం చేయిస్తానని సోషల్ మీడియా వేదికగా హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు మంచు మనోజ్‌- మౌనిక ఆధ్వర్యంలో వారి ఐక్య ధైర్య సేవా సమితి సేవా ద్వారా శనివారం ఉదయం 7 గంటలకే తన అనుచరులు, సేవా బృందంతో కలిసి తోటపల్లిలోని దాసరి సమాధి వద్దకు చేరుకున్నారు. సమాధి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, ప్రాంగణం మొత్తాన్ని శుభ్రం చేయించారు. పనులు పూర్తయిన తర్వాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి దాసరి నారాయణరావు, ఆయన సతీమణి పద్మల సమాధుల వద్ద మనోజ్ ప్రత్యేక నివాళులర్పించారు. 

Also Read:https://teluguprabha.net/top-stories/husband-seeks-mercy-killing-due-to-wife-harassment-in-gujarat/

మరోవైపు దాసరి సమాధి దుస్థితిపై మంచు మనోజ్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా స్పందించింది. తదుపరి పునరుద్ధరణ పనుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ముందుకు వచ్చింది. మంచు మనోజ్‌ చూపిన చొరవపై సినీ వర్గాలతో పాటు అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News