సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు(Mohan babu) కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. తన వస్తువులు పోయాయంటూ జల్‌పల్లి నివాసం వద్దకు చేరుకున్న మనోజ్(Manchu Manoj) గేటు బయటే భైఠాయించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వివాదంపై మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఏమాత్రం ఆస్తి గొడవ కాదని తెలిపారు. ఏప్రిల్ 2న తన పాప పుట్టినరోజు కుటుంబంతోనే సెలబ్రేట్ చేసుకోవాలనుకుని రాజస్థాన్‌లోని జైపుర వెళ్లామన్నారు. తనకు ఈ ఆస్తి వద్దని నాన్నకు ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా అన్నారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా ఇప్పటివరకూ పోలీసులు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని వాపోయారు. కత్తులు, గన్‌లతో తమను కొట్టడానికి వచ్చారని.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు పోలీసులకు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంట్లో తన పెంపుడు జంతువులు, వస్తువులు ఉన్నాయని మనోజ్ వెల్లడించారు.