మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ మొదలైంది. మంచు విష్ణు(Vishnu) నుంచి తనకు ప్రాణహానీ ఉందంటూ పహడీషరీఫ్ పోలీసులకు మనోజ్(Manoj) మరోసారి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో విష్ణు సన్నిహితుడు వినయ్ అనే వ్యక్తి కూడా చేర్చాడు. మొత్తం ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు. దీంతో పోలీసులు మనోజ్ ఫిర్యాదును పరిశీలిస్తున్నారు.
- Advertisement -
ఇదిలా ఉంటే మోహన్ బాబుకు(Mohan Babu) మరో భారీ షాక్ తగిలింది. జర్నలిస్టులపై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(TG Highcourt) కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.