Manchu manoj praise vishnu: కొంతకాలంగా మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు, కేసులు పెట్టుకోవడం వంటివి జరిగాయి. మనోజ్ అయితే విష్ణు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. మోహన్ బాబును తన నుంచి దూరం చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ విడుదల సందర్భంగా మూవీ యూనిట్ కి విషెస్ చెబుతూ మనోజ్ చేసిన ట్వీటులో కూడా విష్ణు పేరు ప్రస్తావించలేదు.
మై లిటిల్ ఛాంపియన్స్ అరి, వివి, అవ్రామ్ లను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రభాస్ గోల్డెన్ హార్ట్ గాడ్ ఆఫ్ ది గాడ్స్, మోహన్ లాల్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్ తో పాటుగా ఈ మూవీపై ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి నటనను వెండి తెరపై చూడటానికి వెయిట్ చేస్తున్నానని మనోజ్ పోస్ట్ చేశారు. ఇందులో విష్ణు పేరు ప్రస్తావించకపోవడం చర్చనీయాశంగా మారింది.
ఈ చర్చ జరుగుతుండగానే తాజాగా మనోజ్ తన అన్న విష్ణుపై ప్రశంసలు కురిపించడం విశేషం. ఇవాళ విడుదలైన కన్నప్ప మూవీకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మూవీ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సినిమా చూసిన మనోజ్ మీడియాతో మాట్లాడారు. కన్నప్ప సినిమా చాలా బాగుందని చెప్పారు.
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. తాను అనుకున్న దాని కంటే వెయ్యి రెట్లు మూవీ బాగుందన్నారు. చివరి 20 నిమిషాలు చూడగానే గూస్‌బంప్స్ వచ్చాయని కొనియాడారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు అయితే తనను భావోద్వేగానికి గురిచేశాయని చెప్పుకొచ్చారు. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా మరో స్థాయికి వెళ్లిందని చెప్పారు. అన్న విష్ణు కూడా ఇంత బాగా నటన చేస్తారని అసలు ఊహించలేదని ప్రశంసించారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా అని మనోజ్ వెల్లడించారు. దీంతో విష్ణును అన్న అంటూ మనోజ్ సంబోధించడం.. నటన బాగుదంటూ ప్రశంసించడం వైరల్ గా మారింది.
Manchu Manoj: అన్న యాక్టింగ్ అదిరిపోయింది.. మంచు విష్ణుపై మనోజ్ ప్రశంసలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES