Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతకొంతకాలంగా నెపోటిజం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. హిందీ ఇండస్ట్రీలో దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది కూడా. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ అవడం సాధ్యపడేది కాదని, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ పిల్లలే ఇక్కడ వెలుగుతారని చెప్పుకుంటుంటారు. కానీ, దీన్ని అందరు ఏకీభవించరు. అన్నిటికంటే కూడా ఇక్కడ టాలెంట్ మాత్రమే ముఖ్యం అని అది లేకపోతే ఎవరూ ఎదగలేరని ఇంకొందరు అంటుంటారు.
అయితే, తాజాగా మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ స్టార్స్‌కి మోటివేషన్‌లా మారాయి. టాలెంటెడ్ యాక్టర్‌గా పాపులర్ అవుతున్న సుహాస్ తాజాగా ‘ఓ భామ అయ్యో రామ’ అనే సినిమాను చేశాడు. ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. దీనికి మంచు మనోజ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా మనోజ్.. నటుడిగా ఎదగాలంటే కష్టపడక తప్పదు. తమ ఫ్యామిలీకి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని.. సినిమాల్లో విజయం సాధిస్తామనుకోవడం పొరపాటని అన్నారు. అంతేకాదు, నేనే అందుకు ఒక ఉదాహరణ అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
Also Read- The Rajasaab: ప్రభాస్‌తో మిల్కీ బ్యూటీ స్టెప్పులు- రాజా సాబ్‌లో స్పెషల్ సాంగ్!
ఇక ప్రజెంట్ జనరేషన్ కి సుహాస్ లాంటి నటుడు స్ఫూర్తి అని మనోజ్ అన్నారు. “సుహాస్ యూట్యూబ్ తో తన నటన మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇది ఎవరూ ఊహించలేరు. ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ అందరూ సుహాస్ ని చూసి నేర్చుకోవాలని చెప్పారు. సినీ ఇండస్ట్రీలోకి రావాలంటే బ్యాక్‌గ్రౌండ్ హెల్ప్ అవుతుంది.. కానీ, అది సరిపోదు. ఒక్కో మెట్టు ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. నెపోకిడ్స్ అయినా ఎదగాలంటే అన్నీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే.
ఇక బడ్జెట్ సినిమాలు, మల్టీస్టారర్ మూవీస్ చేస్తేనే స్టార్స్ అవుతారనేది తప్పు ఆలోచన అని చెప్పారు మనోజ్. ఏ సినిమాకైనా కంటెంట్ ముఖ్యం. చిన్నదా పెద్దదా అనే ఫార్ములాలేవి పనికిరావు” అంటూ ఆసక్తికరంగా మట్లాడారు. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, మనోజ్ చెప్పినవన్నీ 100 శాతం నిజమని అంటున్నారు. ఒక నెపో కిడ్ ఇలా మాట్లాడటం చాలా గొప్ప విషయమని మంచు మనోజ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Also Read- Naga Chaitanya: సమంత డైరెక్టర్‌తో నాగచైతన్య పాన్ ఇండియన్ మూవీ!


