Saturday, March 1, 2025
Homeచిత్ర ప్రభManchu Vishnu: జనరేటర్‌లో పంచదార అందుకే పోశా: విష్ణు

Manchu Vishnu: జనరేటర్‌లో పంచదార అందుకే పోశా: విష్ణు

మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa)సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నయనతార, మోహన్ లాల్, మధుబాల లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. మార్చి1న సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు.

- Advertisement -

ఇటీవల మంచు కుటుంబంలో నెలకొన్ని వివాదాలతో పాటు సినిమాలకు సంబంధించిన ప్రశ్నలను నెటిజన్లు అడిగారు. ఓ నెటిజన్ అయితే ‘‘నిన్ను ఏమన్నా.. మాకు సమాధానం ఇచ్చిన మంచి మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్‌లో షుగర్‌ ఎందుకు వేశావ్‌ అన్నా’’ అని అడిగారు. దీనికి విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందని వాట్సాప్ యూనివర్సిటీలో చదివా’’ అని ఆన్సర్ ఇచ్చారు. కాగా ఇటీవల తన ఇంటి వద్ద పార్టీ చేసుకుంటున్న సమయంలో జనరేటర్‌లో పంచదార పోసి విద్యుత్ సరఫరాను విష్ణు నిలిపివేశారంటూ ఆయన సోదరుడు మంచు మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News