Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభManchu Vishnu: కొరియోగ్రాఫర్ డైరెక్షన్‌లో మూవీ ఫిక్స్..!

Manchu Vishnu: కొరియోగ్రాఫర్ డైరెక్షన్‌లో మూవీ ఫిక్స్..!

Manchu Vishnu Next Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఇటీవల థియేటర్స్‌లో రిలీజై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శివ బాలాజి లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో న‌టించిన క‌న్న‌ప్ప సినిమా జూన్ 27న రిలీజై మంచి వసూళ్ళను రాబడుతోంది. ఢీ, దూసుకెళ్తా లాంటి సూపర్ హిట్స్ ఉన్నా కూడా విష్ణుని యాక్టింగ్ పరంగా సోషల్ మీడియాలో బాగానే విమ‌ర్శిస్తుంటారు. వారందరికి కన్నప్ప చిత్రంతో విష్ణు గట్టిగానే స‌మాధానం చెప్పారు.

- Advertisement -

క‌న్న‌ప్ప ఇచ్చిన స‌క్సెస్ తో విష్ణు త‌న నెక్స్ట్ మూవీని లైనప్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే విష్ణు ఓ క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట. క‌న్న‌ప్ప త‌ర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందో అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అయితే, ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఓ సినిమా చేసేందుకు ఒకే చెప్పినట్టుగా లేటెస్ట్ అప్‌డేట్.

మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న దాదాపు అగ్ర హీరోలందరికీ డాన్స్ కొరియోగ్రఫీని అందించారు ప్రభుదేవా. అంతేకాదు, తెలుగులో దర్శకుడిగా ప్రభాస్‌తో పౌర్ణమి, సిద్ధార్థ్ తో నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలు రూపొందించారు. బాలీవుడ్‌లో ప్ర‌భుదేవా కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వచ్చిన క‌న్న‌ప్ప సినిమాకు కూడా ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫ‌ర్‌గా పనిచేశారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విష్ణు, ప్ర‌భుదేవా మ‌ధ్య మంచి బాండింగ్ కుదిరిందట. అదే, ఇప్పుడు సినిమా చేసే వ‌ర‌కు వెళ్లింద‌ని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇక, ఈ సినిమా కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో విష్ణు రోల్ ఎంతో ఎన‌ర్జిటిక్ గా ఉండేలా ప్ర‌భుదేవా ప్లాన్ చేశార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News