ధూంధాంగా పెళ్లిచేసుకునే సెలబ్రిటీలు వాళ్ల పెళ్లిళ్ల తరువాత వెడ్డింగ్ డ్రెస్సులు, వాటి లేబర్, స్పెషాలిటీలన్నీ చెప్పటం రొటీన్ గా మారింది. హన్సిక మొదలు లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్న కియరా అద్వానీ వరకూ సెలబ్స్ ఇలాంటి కథలు, తెరవెనుక కథలు మనకు చెబుతూ కొన్ని రోజులవరకూ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉన్నారు.
ఈనెల 7వ తేదీన రాజస్థాన్ రాయల్ ప్యాలెస్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహ వేడుకల వివరాలు ఒక్కొక్కటే వీరు ఇన్స్టీ స్టోరీల్లో షేర్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా కియరా డ్రెస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా చెప్పిన స్టోరీ మేరకు .. హల్దీ ఫంక్షన్ డ్రెస్ గోల్డెన్ లెహంగా వివరాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.
గోల్డ్ లెహెంగాను మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా ఇది పూర్తి చేసేందుకు 4000 గంటలు పట్టింది. అంతేకాదు ఈ లెహెంగాపై 98 క్యారెట్ స్వరోస్కీ క్రిస్టల్స్ పొదిగారు. 98,000 జిగేల్ మనే స్వరోస్కీ నాచురల్ డైమండ్స్ ను రూపొందించినట్టు మనీష్ వివరించారు.