Friday, November 14, 2025
Homeచిత్ర ప్రభManjima-Gautham : పెళ్లిపీటలెక్కబోతున్న హీరో, హీరోయిన్..

Manjima-Gautham : పెళ్లిపీటలెక్కబోతున్న హీరో, హీరోయిన్..

- Advertisement -

Manjima-Gautham : మలయాళం హీరోయిన్ మంజిమా మోహన్ తమిళ్, మలయాళం, తెలుగు సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరైంది. తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మెప్పించింది. మంజిమా ప్రస్తుతం తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. కొన్ని రోజుల క్రితం మంజిమా ఒకప్పటి స్టార్ హీరో కార్తిక్ తనయుడు గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించింది. కడలి సినిమాతో హీరోగా పరిచయమైన గౌతమ్ తమిళ్ లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

గౌతమ్, మంజిమా కలిసి తమిళ్ లో దేవరత్తమ్‌ అనే సినిమాలో నటించారు. అప్పట్నుంచి వీరిద్దరూ స్నేహితులుగా మారి ఆ స్నేహం కాస్త తర్వాత ప్రేమగా మారింది. తాజాగా వీరిద్దరూ నవంబర్ 28న పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ మేరకు మీడియాకి సమాచారం అందించారు. నవంబర్ 28న చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గౌతమ్, మంజిమా పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. వీరి పెళ్ళికి పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా హాజరవ్వనున్నారు.తాజాగా ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా చేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad