Manoj Bajpayee : ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మరోసారి దేశమంతటిని తన వైపుకి తిప్పుకున్నాడు మనోజ్ బాజ్పాయ్. ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు 25 ఏళ్లుగా హిందీలో నటుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సత్య, హ్యాపీ, వేదం.. లాంటి పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్నాడు మనోజ్ బాజ్పాయ్.
గతేడాది మనోజ్ బాజ్పాయ్ తండ్రి రాధాకాంత్ బాజ్పాయ్ మరణించారు. తాజాగా మనోజ్ తల్లి గీతాదేవి మరణించారు. అనారోగ్య, వృద్ధాప్య సమ్యలతో ఆవిడ ఇవాళ ఉదయం కన్నుమూశారు. తండ్రి మరణించిన సంవత్సరం లోపే తల్లి కూడా మరణించడంతో మనోజ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. బాలీవుడ్ ప్రముఖులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.