Homeచిత్ర ప్రభMaremma: మన ఊర్లో జరిగిన కథను చూస్తున్నట్టుగా ‘మారెమ్మ’

Maremma: మన ఊర్లో జరిగిన కథను చూస్తున్నట్టుగా ‘మారెమ్మ’

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ ఇప్పుడు ‘మారెమ్మ’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. నూతన దర్శకుడు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించగా, మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న క్రమంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేయగా…ముఖ్య అతిథిగా దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ, “మాధవ్ ఈ చిత్రం టీజర్‌ను చూపించాడు. నిజానికి ఒక డెబ్యూ హీరో తొలి సినిమా చేస్తున్నప్పుడు పాటలు, ఫైట్లు అన్నీ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఒక ప్రేమకథతో రావాలి అనుకుంటారు. కానీ అవన్నీ కాకుండా ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమాని ఎంపిక చేసుకోవడం పట్ల నేను తనని అభినందిస్తున్నాను. తను నిజాయితీగా దర్శకుడు చెప్పిన కథను నమ్మి ఈ ప్రయత్నం చేశాడు. ఫస్ట్ సినిమాకే ఇంత హార్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడం మామూలు విషయం కాదు. సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి” అని అన్నారు. హీరో మాధవ్ మాట్లాడుతూ, “బేసిగ్గా అన్నదమ్ముల మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో ఒక దున్నపోతుకు, ఒక మనిషికి మధ్య అనుబంధం ఎలా ఉంటుందో సెప్టెంబర్ 10న మీకు కనిపించబోతోంది. మా పెదనాన్న రవితేజ ఈ సినిమా చూశారు. ఆయనకి క్లైమాక్స్ చాలా అద్భుతంగా నచ్చింది. చాలా ఎమోషనల్ అయ్యారు” అని చెప్పారు. హీరోయిన్ దీప మాట్లాడుతూ, మాధవ్ తో నటించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొనగా…డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ, ” ట్రైలర్‌కి పదిరెట్లు సినిమా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాల్లో గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తుంది. ‘మారెమ్మ’ అనేది ప్రతి విలేజ్‌లో ప్రతి మనిషి చూసుకునే క్యారెక్టర్‌లాగా ఉంటుంది. మన ఊర్లో జరిగిన కథ చూస్తున్నట్టుగా ఉంటుంది” అని అన్నారు. నిర్మాత మయూర్ మాట్లాడుతూ, “ఇది మన తెలంగాణ పల్లెటూరి సినిమా. మన అందరి ఊర్లో ఉండే కథ” అని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News