Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభMass Maharaja: అదిరిపోయిన వాల్తేరు వీరయ్య కొత్త టీజర్.. సంక్రాంతికి మాస్ పూనకాలే

Mass Maharaja: అదిరిపోయిన వాల్తేరు వీరయ్య కొత్త టీజర్.. సంక్రాంతికి మాస్ పూనకాలే

- Advertisement -

Mass Maharaja : చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని గతంలోనే ప్రకటించారు.

తాజాగా రవితేజ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఓ మేకపిల్లని పట్టుకొని రవితేజ వస్తుంటే ‘మేకపిల్లని పట్టుకొని మొదటిసారి పులి వస్తుంది’ అంటూ మాస్ వాయిస్ తో ఎంట్రీ ఇచ్చి రౌడీలని దుమ్ము దులిపేస్తాడు. తన మాస్ స్టైల్ ఫైట్స్ తో అదరగొట్టేశాడు. టీజర్ చూసి రవితేజ అభిమానులైతే ఫుల్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు తెలిపారు. ఈ టీజర్ ని షేర్ చేస్తూ చిరంజీవి.. అతని బ్యాక్ గ్రౌండ్ కేవలం హార్డ్ వర్క్, అతని సపోర్ట్ ప్రేమించే మాస్ అని పెట్టారు. రవితేజ దీనికి రిప్లై ఇస్తూ అది మీరిచ్చిన ధైర్యం అన్నయ్య అని పోస్ట్ చేశారు.

ఇక వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ యూరప్ లో సాంగ్ షూట్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఉండగా రవితేజ టీజర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సంక్రాంతికి థియేటర్స్ మాస్ తో మోతమోగిపోతాయి అంటున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News