Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను కమిటవడమే కాకుండా ఆ చిత్రాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే, యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను దాాదాపు పూర్తి చేశారు. సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఇందులో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో చిరంజీవి తన మెగా 157ను చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి బరిలో దింపాలని అనిల్ రావిపూడి నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు. రెండు నుంచి మూడు నెలల్లోనే స్క్రిప్ట్ కంప్లీట్ చేసి సెట్స్ మీదకి వచ్చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ముస్సోరీలో రెండో షెడ్యూల్‌ను ముగించారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సాహుగారపాటి, సుష్మిత కొణిదెల కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
చిరంజీవి గతంలో నటించిన బ్లాక్ బస్టర్స్ గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాలతో ప్రస్తుతం అనిల్ రావిఊడి సినిమాను పోల్చుతున్నారు. అంతేకాదు, మెగా 157 లో చిరు లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని ప్రచారం అవుతుండగా ప్రస్తుతం నెట్టింట్లో లేటెస్ట్ చిరు లుక్ ఒకటి వైరల్ అవుతోంది. చిరు పాత్రని అనిల్ రావిపూడి ఎంతో స్టైలీష్‌గా డిజైన్ చేశారని ఈ లుక్ చూస్తే అర్థం అవుతోంది. అంతేకాదు, మెగా 157 నుంచి లీకైన వీడియోను చూస్తుంటే చిరు కామెడీ టైమింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందనిపిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/after-kubera-success-sekhar-kammula-hikes-his-remuneration/
మెగా 157 ఓపెనింగ్ లో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడులో చిరంజీవి చేసిన కామెడీని లాగే, వింటేజ్ మెగాస్టార్‌ను చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పారు. తాజాగా బయటకు వచ్చిన వీడియో చూస్తే చిరంజీవి కామెడీ టైమింగ్ అలాగే ఉందనిపిస్తోంది. అంతేకాదు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ కొడుకుగా నటించిన బుల్లిరాజు ఈ మూవీలో కూడా ఉన్నాడని క్లారిటీ వచ్చింది. వెంకీ-బుల్లిరాజుల కామెడీ సంక్రాంతికి వస్తున్నాంలో హైలెట్‌గా నిలిచింది. ఇక మెగా 157 లో అంతకుమించి చిరు-బుల్లిరాజుల కామెడీ ఉంటుందని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది.
మరో వైపు మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబోలో రూపొందుతోన్న విశ్వంభర సినిమా గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి చేసుకుని, టీమ్ శాటిస్పై అయిన తర్వాతే సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ వస్తుందని సినీ సర్కిల్స్ వస్తున్నాయి. సోషియో ఫాంటసీ చిత్రంగా విశ్వంభర తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.