Thursday, January 2, 2025
Homeచిత్ర ప్రభMatka a very impactful movie: కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చే 'మట్కా'

Matka a very impactful movie: కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చే ‘మట్కా’

ట్రైలర్ లాంచ్ చేసిన చిరు..

‘మట్కా’ వెరీ ఇంపాక్ట్ ఫుల్ స్టోరీ. క్యారెక్టరైజేషన్, వరల్డ్ బిల్డింగ్ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ ట్రావెల్ అవుతారు. ‘మట్కా’ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్

- Advertisement -

-మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ ‘మట్కా’ గ్రిప్పింగ్ ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

‘సర్కస్ లో బఫున్స్ ని చూసి జనం అంతా నవ్వుతారు, చప్పట్లు కొడతారు, కానీ ఒక చిన్న కర్ర పట్టుకుని పులుల్ని సింహాల్ని ఆడించేవాడు ఒకడు ఉంటాడు. అలాంటోడే వీడు. రింగ్ మాస్టర్ ‘ అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గ్రిప్పింగా సాగింది.

1950 -80 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, గెటప్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. వాసు క్యారెక్టర్ లో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు వరుణ్ తేజ్.

వాసు క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ పలికిన డైలాగులు డైనమైట్స్ లా పేలాయి. ‘వేలు తీసుకొని వ‌దిలేయ‌డానికి నేను ద్రోణాచార్యుడ్ని కాదు. మ‌ట్కా కింగుని’. ‘నీలాంటి మంచోళ్ల వల్ల టైమ్‌కి వర్షాలు పడుతున్నాయి. పంటలు పండుతున్నాయి. కానీ నాలాంటి చెడ్డోళ్ల వల్ల ఓ పదిమంది కడుపులు నిండుతున్నాయి. నేచర్‌ బ్యాలెన్స్‌’ అనే డైలాగ్స్ అదిరిపోయాయి.

వాసు ప్రేమికురాలు గా మీనాక్షి చౌదరి స్క్రీన్ ప్రజెన్స్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ట్రైలర్ లో నోరా ఫతేహి, నవీన్ చంద్ర, జాన్ విజయ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.

డైరెక్టర్ కరుణ కుమార్ గ్రిప్పింగ్ నెరేటివ్ తో మాట్కాని యూనివర్సల్ అప్పీల్ వుండే సినిమాగా ప్రజెంట్ చేశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. ట్రైలర్ కి జీవి ప్రకాష్ కుమార్ అందించిన బీజీఎం ఎమోషన్, యాక్షన్ ని మరింతగా ఎలివెంట్ చేసింది. ఎ కిషోర్ కుమార్ కెమరా వర్క్ బ్రిలియంట్ గా వుంది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి. వింటేజ్ వైజాగ్ ని చాలా అద్భుతంగా చూపించారు. మొత్తానికి ఈ సెన్సేషనల్ ట్రైలర్ మట్కాపై అంచనాలని మరింతగా పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మా టీమ్ అంతా చాలా పాషన్ తో ఈ సినిమా చేయడం జరిగింది. నవంబర్ 14న ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. నేను మాస్ సినిమా చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది. ఫ్యాన్స్ అందర్నీ హ్యాపీ చేసే సినిమా అవుతుంది. ఈ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను. చిరంజీవి గారికి ట్రైలర్ చాలా నచ్చింది. చాలా మాస్ గా ఉందని ఆయన కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మట్కా చాలా ఇంపాక్ట్ ఫుల్ స్టోరీ. క్యారెక్టర్రైజేషన్, వరల్డ్ బిల్డింగ్ చాలా కొత్తగా ఉంటాయి. వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ ట్రావెల్ అవుతారు. ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా ఇది. నవంబర్ 14న థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. మట్కా ఒక స్పెషల్ ప్రాజెక్ట్. ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసాం. ఈ ప్రాజెక్టులో పార్ట్ చేసిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. వరుణ్ ఫెంటాస్టిక్. చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. జీవి ప్రకాష్ మ్యూజిక్ అద్భుతంగా వుంది. టీం అందరికీ థాంక్ యూ. నవంబర్ 14న థియేటర్స్ లో కలుద్దాం’అన్నారు

డైరెక్టర్ కరుణ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మెగా అభిమానులందరికీ నేను ఒక ప్రామిస్ చేదల్చుకున్నాను. వరుణ్ బాబుని మీరు ఎలా చూద్దామనుకుంటున్నారో, ఇలాంటి సినిమాలో చూద్దాం అనుకుంటున్నారో, ఆ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఆయనలో ఉన్న నటుడు, ఆయనలోని యాక్షన్ హీరో.. అన్ని కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. 40లో వైజాగ్ ఎలా ఉండేది, వైజాగ్ లో మనుషులు ఇలా ఉండేవారు, వైజాగ్ లో జరిగిన కథలు ఎలా ఉండేవి, వాటి మధ్యలో హీరో తాలూకా ప్రస్థానం ఎలా ఉంటుంది, అంతా కూడా ఈ సినిమాలో చూపించడానికి100% నా ప్రయత్నం చేశాను. హీరో గారు, టెక్నీషియన్స్ , నిర్మాతలు అందరూ కూడా సహకరించారు. ఈ సినిమా డే వన్ ఎలా అనుకున్నాము అదే సినిమాని ఈరోజు తెర మీదకి తీసుకురాగలిగాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ సినిమా నుంచి ఒక్కొక్క సర్ప్రైజ్ వదులుతుంటాము. మీరు అన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని పెద్ద విజయం సాధించే దిశగా మీరంతా తీసుకెళ్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. నవంబర్ 14న మీ ఫ్యామిలీస్ తో సినిమా హాల్స్ లో కలుద్దాం థాంక్యూ’ అన్నారు.

ప్రొడ్యూసర్ రజిని తాళ్లూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మట్కా మీ అందరికీ మంచి మాస్ ఎంటర్టైనర్. థాంక్యూ సో మచ్’ అన్నారు

ప్రొడ్యూసర్ డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ లో చెప్పినట్టు కరుణ్ కుమార్ కథ ఫస్ట్ డే విన్నప్పుడు నుంచి ఇప్పుడు చూసిన ట్రైలర్ కి నిన్న చూసిన ఎడిట్ రూమ్ కి చాలా తేడా ఉంది. సినిమాని ఇంత అద్భుతంగా మలచిన డైరెక్టర్ గారికి థాంక్యూ వెరీ మచ్. వరుణ్ గారు క్రేజీగా కనిపిస్తున్నారు. మీనాక్షి, టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్’ అన్నారు

యాక్టర్ కార్తికేయ మాట్లాడుతూ..నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన డాక్టర్ కరుణ్ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. నేను నా బెస్ట్ ఇచ్చాను. వరుణ్ తేజ్ అన్న యువర్ సో స్వీట్ థాంక్యూ సో మచ్. నవంబర్ 14న నవంబర్ ఆడియన్స్ థియేటర్లో ఒక కొత్త వరల్డ్ ని చూడబోతున్నారు. మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీతో పాటు వెళ్లి చూడండి థాంక్యూ’అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News