OTT| ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. హాల్‌లో సినిమా చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మట్కా’(Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన రూపుదిద్దుకున్న ఈచిత్రం నవంబర్ 14న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇక తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘అమరన్’. 2014లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో రూపొందిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఓటీటీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు(Amaran). తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది.