Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభMechanic Rocky: ఆకట్టుకుంటున్న 'మెకానిక్ రాకీ' ట్రైలర్

Mechanic Rocky: ఆకట్టుకుంటున్న ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో నటించిన సినిమా ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky). ఇందులో మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లగా నటించగా.. నటుడు సునీల్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, లిరికల్ సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రెండో ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. నెల రోజుల క్రితం ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

- Advertisement -

కాగా ఇటీవల వరంగల్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ మారాయి. ఇదిలా ఉంటే విశ్వక్ నటించిన గత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడో లేదో తెలియాలంటే నవంబర్ 22వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News