Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభMeenakshi Chaudhary: అక్కినేని హీరోతో పెళ్లి - క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌద‌రి!

Meenakshi Chaudhary: అక్కినేని హీరోతో పెళ్లి – క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌద‌రి!

Meenakshi Chaudhary: అక్కినేని హీరో సుశాంత్‌ను హీరోయిన్ మీనాక్షి చౌద‌రి పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు చాలా కాలంగా టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సుశాంత్ హీరోగా న‌టించిన ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు మూవీతోనే మీనాక్షి చౌద‌రి తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా షూటింగ్‌లోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని స‌మాచారం. పెద్ద‌లు వీరి ల‌వ్‌స్టోరీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల సుశాంత్‌, మీనాక్షి చౌద‌రి క‌లిసి ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించ‌డంతో పెళ్లి పుకార్ల‌కు బ‌లం చేకూరింది.

- Advertisement -

ఈ రూమ‌ర్స్‌పై మీనాక్షి చౌద‌రి టీమ్ క్లారిటీ ఇచ్చింది. సుశాంత్‌, మీనాక్షి చౌద‌రి మ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం స్నేహం మాత్ర‌మేన‌ని వెల్ల‌డించారు. పెళ్లి అంటూ సోష‌ల్ మీడియాలో కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఈ పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని అన్నారు. ఇక‌నైనా ఈ రూమ‌ర్స్‌కు పుల్‌స్టాప్ పెడితే మంచిదంటూ వెల్ల‌డించారు.

Also Read- Faria Abdullah: కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌ – ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకుతో సినిమా

గ‌తంలో ఓ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో సుశాంత్‌తో పెళ్లి అంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను మీనాక్షి చౌద‌రి స్వ‌యంగా కొట్టిప‌డేసింది. అయినా పుకార్లు మాత్రం ఆగ‌లేదు. మ‌రి ఈ సారి అయినా ఈ రూమ‌ర్స్‌కు చెక్‌ప‌డుతుందో లేదో చూడాల్సిందేన‌ని అభిమానులు చెబుతున్నారు. 2024లో మీనాక్షి జోరు కొన‌సాగింది. ఆ ఏడాది తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఆరు సినిమాలు చేసింది. మ‌హేష్‌బాబు, ద‌ళ‌ప‌తి విజ‌య్ వంటి స్టార్ హీరోల‌తో జోడీక‌ట్టింది. కానీ మీనాక్షికి అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. ల‌క్కీ భాస్క‌ర్ మిన‌హా మిగిలిన సినిమాలేవి విజ‌యాల‌ను సాధించ‌లేదు. ఈ ప‌రాజ‌యాల‌తో సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటోంది.

ఈ ఏడాది వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాంలో ఓ హీరోయిన్‌గా న‌టించింది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం తెలుగులో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజుతో పాటు నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ సినిమాలు చేస్తుంది. అన‌గ‌న‌గా ఒక రాజు మూవీ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇటీవ‌లే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. కాగా హిందీలో ఓ వెబ్‌సిరీస్‌కు మీనాక్షి చౌద‌రి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read- Kalyani Priyadarshan: ఒక్క హిట్‌తో 100 కోట్ల సినిమాలో ఛాన్స్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News