Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభMega Family Heroes: మెగా ఫ్యామిలీలో ఘ‌నంగా సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్‌..దోశ‌లు వేసిన స్టార్స్‌

Mega Family Heroes: మెగా ఫ్యామిలీలో ఘ‌నంగా సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్‌..దోశ‌లు వేసిన స్టార్స్‌

Mega Family Heroes: మెగాస్టార్ చిరంజీవి నివాసం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా పండుగ సందడితో కళకళలాడింది. ఇటీవలే సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తో్న మెగా కుటుంబానికి ఈ పండుగ మరింత ఆనందాన్ని తీసుకొచ్చింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి సంప్రదాయబద్ధంగా, ఆనందంగా సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు.

- Advertisement -

ప్రత్యేకంగా భోగి రోజున జరిగిన ఓ సరదా ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. మెగా హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటింట్లోకి వెళ్లి స్వయంగా దోశలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రామ్ చరణ్ ఎంతో నైపుణ్యంతో దోశలు వేస్తుండగా, కుటుంబ సభ్యులు చుట్టూ చేరి ఆ క్షణాలను ఆస్వాదించారు. ఈ సరదా వీడియోను నిహారిక కొణిదెల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..“ఇది భోగి రోజు కాదు… దోశ డే” అంటూ చమత్కారంగా కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం అభిమానుల్లో విపరీతమైన స్పందనను రాబడుతోంది.

https://www.instagram.com/p/DTfBactE1VD/

Also Read – The Raja Saab: ‘రాజా సాబ్’కి హిందీలో దారుణమైన నష్టాలు?

ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులతో పాటు నాగబాబు దంపతులు, సాయి దుర్గ తేజ్, కొత్త దంపతులు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తదితర మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒక వైపు సాయి దుర్గ తేజ్ కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుండగా, మిగిలినవారు సరదా మాటలతో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. ప్రస్తుతం ఈ సంక్రాంతి సందడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ పండుగ వేడుకలు మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.

Also Read – Director Teja: మోసగాళ్ల చేతిలో చిక్కి భారీగా నష్టపోయిన డైరెక్టర్ తేజ తనయుడు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News