Chiranjeevi: చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలను మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి సినిమాలకు ఆమెను దూరంగా ఉండమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సుస్మిత కొణిదెలపై ఫ్యాన్స్ ఫైర్ కావడానికి కారణం ఏంటో తెలుసా…
క్యాస్టూమ్ డిజైనర్…
ఖైదీ నంబర్ 150 నుంచి తండ్రి చిరంజీవి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తుంది సుస్మిత కొణిదెల. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టైలిష్ట్‌గా వ్యవహరించింది. ఈ సినిమాల్లో చిరంజీవి కోసం సుస్మిత కొణిదెల డిజైన్ చేసిన డ్రెస్‌లపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లుగా క్యాస్టూమ్స్ డిజైన్ చేయడంలో సుస్మిత ఫెయిలైందని, ట్రెండ్స్ గురించి ఆమెకు అస్సలు అవగాహన లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు. రొటీన్ కలర్ ప్యాట్రన్స్ ఫాలో అవుతుందంటూ విమర్శించారు. మెరుపులతో కూడిన జాకెట్… లేదంటే షర్ట్… లోపల మరో టీషర్ట్, మెడలో ఓ చైన్.. ఇదే స్టైల్‌ను ప్రతి సినిమాలోనూ కంటిన్యూ చేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read – Rice : అన్నం తింటే షుగర్ వస్తుందా? ఇందులో నిజమెంత ఉందంటే…!
విశ్వంభర వర్కింగ్ స్టిల్స్…
తాజాగా మరోసారి సుస్మిత కొణిదెలను మెగాఫ్యాన్స్ టార్గెట్ చేశారు. విశ్వంభర సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను చిరంజీవి, మౌనీరాయల్‌లపై ఇటీవల మేకర్స్ షూట్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ తాలూకు వర్కింగ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫొటోల్లో చిరంజీవి డెనిమ్ జాకెట్, టీషర్ట్ ధరించి కనిపించారు. ఈ వర్కింగ్ స్కిల్‌లో చిరంజీవి క్యాస్టూమ్స్ అస్సలు బాగాలేవని ఫ్యాన్స్ చెబుతోన్నారు. చిరంజీవికి సుస్మిత డిజైన్ చేసిన డ్రెస్ సూటవ్వలేదని అంటున్నారు. డ్రెస్ వల్ల మెగాస్టార్ లుక్ తేడా కొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
.@sushkonidela pls go away from Chiranjeevi garu.. don’t do any costume design for boss.. sincere request
— 𝚺𝐂𝐅 𝐆𝛉wtham Reddy (@gautamCGI) July 30, 2025
దూరంగా ఉంటే మంచిది…
ఇకనైనా చిరంజీవి సినిమాలకు సుస్మిత కొణిదెల దూరంగా ఉంటే మంచిదని మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మెగాస్టార్ కోసం ఎలాంటి క్యాస్టూమ్స్ డిజైన్ చేయవద్దని రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. యంగ్ లుక్ అంటూ చిరంజీవిని ఫన్నీగా చూపిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మెగాస్టార్‌ను వదిలేయండి అంటూ సుస్మిత కొణిదెలను ఉద్దేశించి ఫ్యాన్స్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
మెగా 157 ప్రొడ్యూసర్…
కాస్ట్యూమ్ డిజైనర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తోంది సుస్మిత కొణిదెల. ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా157 సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
Also Read – Pragya Jaiswal: నయన్ రేర్ ఫీట్‌పై కన్నేసిన ప్రగ్యా జైస్వాల్ – బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?


