Ram Charan- Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై మెగా హీరో రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. స్టార్‌డమ్‌ను వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం హర్షణీయమని కొనియాడారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఆయన్ను చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ntr-bharosa-funds-released-for-the-month-of-june/
‘సినిమా కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి ప్రజాసేవకు అంకితం కావడం చాలా గొప్ప విషయం. చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తిగా సీఎం విజయ్ సాధించిన విజయం, ఆయన తీసుకున్న నిర్ణయం చూసి గర్వపడుతున్నాను. విజయ్‌తో పాటు ఆయనను గెలిపించిన తమిళనాడు ప్రజలకు ప్రత్యేక అభినందనలు.’ – రామ్ చరణ్
Also Read: https://teluguprabha.net/top-stories/cm-revanth-reddy-sensational-comments-on-kcr-and-harish-rao/
కాగా, విలేకరులు అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ ఆసక్తికరంగా స్పందించారు. తన రాజకీయ ఎంట్రీ గురించి ప్రస్తావించగా, తనకు ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయడం సాధ్యపడదని అన్నారు. ప్రస్తుతానికి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే అత్యుత్తమంగా రాణించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో, రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది.

