Wednesday, July 16, 2025
Homeచిత్ర ప్రభVaishnav Tej: డోంట్ కేర్ అంటోన్న వైష్ణ‌వ్ తేజ్‌

Vaishnav Tej: డోంట్ కేర్ అంటోన్న వైష్ణ‌వ్ తేజ్‌

Mega Family Hero: మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చాడంటే అతను ఖచ్చితంగా కమర్షియల్ హీరోగా సెటిల్ అవ్వాల్సిందే. హిట్ అండ్ ఫ్లాప్స్ ప్రతీ ఒక్కరికీ కామన్. కానీ, డాన్స్, పర్ఫార్మెన్స్, కామెడీ లాంటి విషయాలలో మెగా హీరోల టైమింగ్ వేరే. ఉప్పెన మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. అయితే అదే సక్సెస్ ట్రాక్ ని ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు.

- Advertisement -

దాంతో మిగతా హీరోలతో చూసుకుంటే వైష్ణవ్ తేక్ రేస్ లో కాస్త వెనకపడ్డాడు. ఉప్పెన (Uppena Movie) తర్వాత చేసిన మూడు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆది కేశవ (Kesava) మీద మెగా మేనల్లుడు చాలా నమ్మకాలు పెట్టుకుంటే అది ఎలా వచ్చిందో అలా వెళ్లిపోయిన్ది. ఆది కేశవ తర్వాత వైష్ణవ్ తేజ్ కి బాగానే గ్యాప్ వచ్చింది. ఈసారి సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి హిట్ కొట్టాల్సిందే అని రక రకాల కథలను వింటున్నాడు.

ఇప్పటికే, దాదాపు 60 నుంచి 70 కథల వరకూ విన్నాడట. కానీ, వాటిలో ఏ ఒక్కటీ వైష్ణవ్ కి నచ్చలేదని ఇన్‌సైడ్ టాక్. జనరల గా మెగా మేనల్లుడు సినిమా కథ ముందు మెగాస్టార్ (Megastar), నాగబాబు (Nagababu) వింటారు. వీళ్లకి నచ్చితేనే అడుగు ముందుకు పడుతుంది. కథ నచ్చినా ట్రీట్‌మెంట్ నచ్చకపోతే రిజెక్ట్ చేయకుండా హోల్డ్ పెట్టేస్తారు. అలా, చాలామంది దర్శకులు ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించే కథ విషయంలోనూ ఫైనల్ డెసిషన్ మెగాస్టార్‌దే ఉంటుంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh) కూడా మెగాస్టార్ తో సినిమా చేయాలని ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్నారు. ఆటోజానీ కథ చెప్పారు కూడా. ఫస్టాఫ్ నచ్చింది సెకండాఫ్ కరెక్షన్స్ చేయమని చెప్పారట. అంతే మొత్తానికే ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది.

అలాంటప్పుడు కొత్త దర్శకులు మెగా మేనల్లుళ్ళ కోసం కథ చెప్తే అంత త్వరగా ఫైనల్ చేయడం సులభం కాదు. పైగా వైష్ణవ్ తేజ్ కెరీర్ వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉంది. అందుకే, ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్ట్ ని ఈ యంగ్ హీరో ప్రకటించలేదు. మెగా హీరోలకి కథ రాయడం అంటే చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ మైండ్‌లో పెట్టుకొని హిట్ ఇచ్చే కథతో ఒప్పించడం అంటే పెద్ద రిస్కే. మరి మెగా మేనల్లుడు కొత్త సినిమా శుభవార్త చెప్పేదెప్పుడో మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News