Chiranjeevi – Tilak Varma: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా సెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ.. మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. ఈ మధ్య దుబాయ్‌లో జరిగిన ఏషియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ తన బ్యాటింగ్ ప్రతిభతో ఇండియా టీమ్‌కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీనికి తిలక్‌ను చిరంజీవి పులమాలతో సన్మానించి అభినందించారు. తర్వాత కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు నయనతార సహా ఇతర టీమ్ సభ్యులందరూ పాల్గొన్నారు.




