Sandeep Vanga: ప్రభాస్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో స్పిరిట్ మూవీని అనౌన్స్‌చేసి మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ షూటింగ్ మొదలుకాలేదు. అయినా సినిమాపై అభిమానుల్లో ఉన్న క్రేజ్, బజ్ కొంచెం కూడా తగ్గకపోగా నానాటికి పెరుగుతూనే ఉంది. స్పిరిట్‌కు సంబంధించిన రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి కనిపిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు ఈ పుకార్లపై సెలైంట్‌గా ఉన్న సందీప్ వంగా ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశాడు. జిగ్రీస్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్‌తో కలిసి సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో స్పిరిట్‌లో చిరంజీవి నటిస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని సందీప్ వంగా పేర్కొన్నాడు. అవన్నీ వట్టి రూమర్స్ అని తేల్చేశాడు. ఎప్పటికైనా చిరంజీవితో ఓ సినిమా మాత్రం చేస్తానని అన్నాడు.
మరోవైపు స్పిరిట్ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్‌గా నటించబోతున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ పుకార్లపై మాత్రం సందీప్ వంగా ఆన్సర్ ఇవ్వలేదు. ఔనని, కాదని చెప్పకుండా సైలెంట్‌గా సమాధానం దాటవేశాడు. దాంతో స్పిరిట్‌లో డాన్ లీ నటిస్తున్నది నిజమేనంటూ అభిమానులు ఫిక్సవుతున్నారు.
Also Read – Araku :ఆసుపత్రిలో దొంగతనం కలకలం – పేషెంట్ల ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగ
త్వరలోనే స్పిరిట్‌కు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్ ఇస్తానంటూ సందీప్ వంగా ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతడి కామెంట్స్‌తో ప్రభాస్ అభిమానులు తెగ ఖుషి అవుతోన్నారు. స్పిరిట్ షూటింగ్ నవంబర్ నెలాఖరు నుంచి మొదలుకాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పీటర్ హెయిన్స్ మాస్టర్ సారథ్యంలో ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ను ప్రారంభించేందుకు సందీప్ వంగా సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.
స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్పిరిట్ నుంచి ఇటీవల వాయిస్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వాయిస్ గ్లింప్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపించింది.
స్పిరిట్ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీ సిరీస్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు కొరియన్, ఇంగ్లీష్ వంటి విదేశీ భాషల్లో స్పిరిట్ రిలీజ్ కాబోతుంది. స్పిరిట్‌తో పాటు ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. సలార్ 2, కల్కి 2 కూడా కమిట్ అయ్యాడు.
Also Read – Red Fort blast Investigation : 26/11 తరహాలో కుట్ర, దేశవ్యాప్తంగా 200 పేలుళ్లకు ప్లాన్

