Hari Hara Veera Mallu trailer: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ యూనిట్ ఇవాళ ఉదయంట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ పవర్ ప్యాక్డ్‌గా అదిరిపోయింది. విజువల్స్, పవన్ లుక్ అదిరిపోయింది. ఈ నేపథ్యంలో మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ పవన్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.
తాజాగా మూవీ ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎంతో బాగుందన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కల్యాణ్‌బాబు నుంచి వస్తున్న ఈ మూవీకి కచ్చితంగా థియేటర్లు దద్దరిల్లిపోతాయన్నాని పేర్కొన్నారు.
https://x.com/KChiruTweets/status/1940718750317072538
ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ట్రైలర్ అదిరిపోయిందంటూ పోస్ట్ చేశారు. మూవీ ఎంత అద్భుతంగా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూపించిందన్నారు. వెండితెరపై ఫ్యాన్స్‌కు పవన్ కల్యాణ్ గారు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు అని తెలిపారు. చిరు, చెర్రీ పోస్టులకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది.
https://x.com/AlwaysRamCharan/status/1940723478673739972
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మించారు. వీరమల్లు అనే పోరాట యోధుడి పాత్రలో పవన్ నటించారు. ఇక బాలీవుడ్ నటుడు బేబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో విలన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు హీరోయిన్‌గా నిధి అగర్వాల్, సత్యరాజ్, విక్రమ్ జీత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ధర్మం కోసం యుద్ధం అంటూ ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో ఫస్ట్ పార్ట్ తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ రిలీజైన కొన్ని రోజులకు సెకండ్ పార్ట్ డేట్ ప్రకటిస్తారు.
ఇప్పటికే ఫస్ట్ పార్ట్ చిత్రం చాలా సార్లు వాయిదాపడింది. ఓసారి థియేటర్ల బంద్ అంశం, మరోసారి వీఎఫ్క్స్ పనులు ఆలస్యం కావడంతో మూవీ విడుదల లేట్ అయింది. నాలుగు సంవత్సరాలు క్రితమే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీకి అనేక గండాలు ఎదురయ్యాయి. తొలుత మూవీకి క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే సినిమా షూటింగ్ లేట్ అవుతుండటంతో ఆయనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాదాపు 80శాతం మూవీకి క్రిష్ దర్శకత్వం చేశాడు. మిగిలిన 20శాతం షూటింగ్ ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ చేశాడు. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన పాత్రకు సంబంధించి షూటింగ్ పెండింగ్ పడింది. ఇలా ఎన్నో ఆటంకాలు గటెక్కి ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు దగ్గరైంది.
https://www.youtube.com/watch?v=Qv-NEQJehVU