Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభWaltair Veerayya: ‘మెగాస్టార్’ మాస్ పోస్టర్ రిలీజ్.. ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లో పూనకాలు తప్పవంటున్న డైరెక్టర్

Waltair Veerayya: ‘మెగాస్టార్’ మాస్ పోస్టర్ రిలీజ్.. ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లో పూనకాలు తప్పవంటున్న డైరెక్టర్

Waltair Veerayya: ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మెగాస్టార్ గ్లింప్స్, రవితేజ ఇంట్రో, బాస్ పార్టీ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. త్వరలో మరిన్ని ప్రచార చిత్రాలు, పాటలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలో కనిపిస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ రిలీజ్ కాగానే ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ ఈ పోస్టర్ ట్రెండ్ చేస్తున్నారు. దీని గురించి చిత్ర దర్శకుడు బాబీ ఒక ట్వీట్ చేశారు.

ఇది శాంపిల్ మాత్రమే అని, థియేటర్లో ఈ ఎపిసోడ్‌కు పూనకాలు గ్యారెంటీ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. ‘మెగాస్టార్’ మాస్ అవతార్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని కోరాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక పాట గురించి చిరు లీక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చిన్న బిట్ సాంగే విడుదలైనప్పటికీ, అది ఆకట్టుకునేలా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News