Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభMeiyazhagan: కార్తి-అరవింద్ స్వామిల క్రేజీ మూవీ..

Meiyazhagan: కార్తి-అరవింద్ స్వామిల క్రేజీ మూవీ..

భారీ బజ్ మధ్య పోస్ట్ ప్రొడక్షన్ లో..

కార్తీ, అరవింద స్వామి కలిసి తెరపై సందడి చేయనున్నారు. ఈ క్రేజీ మూవీ పేరు మెయ్యళగన్ గా తమిళ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. కార్తి బ్రదర్ సూర్య ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తుండగా హీరో కార్తీకి ఇది 27వ సినిమా.

- Advertisement -

’96’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కార్తీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ‘మెయ్యళగన్’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్ కార్తీ, అరవింద్ స్వామి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపించింది. అరవింద్ స్వామి సైకిల్ తొక్కుతుంటే, కార్తీ వెనుక కూర్చుని చిన్నపిల్లాడిలా పోజు ఇవ్వడం ఆకట్టుకుంది. తెలుగు తమిళ ద్విభాష చిత్రంగా రూపొందుతన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News