Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభMister Bachchan ready to release: మిస్టర్ బచ్చన్.. రెప్పల్ డప్పుల్

Mister Bachchan ready to release: మిస్టర్ బచ్చన్.. రెప్పల్ డప్పుల్

ఆగస్ట్ 15న రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే హైలీ ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్ సెకెండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్ జూలై 25న రిలీజ్

- Advertisement -

ఫస్ట్ సింగిల్‌తో మెలోడియస్ ట్రీట్ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ మేకర్స్ స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్ జూలై 25 న విడుదల కానుంది.

ఈ పాట పోస్టర్ రవితేజను కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లైవ్లీ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. రవితేజ మాస్, గ్రేస్‌ఫుల్ మూవ్‌లో కనిపించారు. మిక్కీ జె మేయర్ స్కోర్ చేసిన ఈ పాటలో రవితేజ డ్యాన్స్ ఫ్లోర్‌ ను అదరగొట్టబోతున్నారు.

రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ నటిస్తుండగా, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

నామ్ తో సునా హోగా అనేది సినిమా ట్యాగ్‌లైన్. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.

మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News