సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు(Mohanbabu) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే కుటుంబ వివాదాలతో సతమతమవుతున్న ఆయనపై సంచలన ఆరోపణలు వచ్చాయి. దివంగత నటి సౌందర్య(Soundarya) 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే సౌందర్య మరణం వెనక మోహన్ బాబు ఉన్నాడని ఖమ్మం జిల్లా రూరల్ మండలానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఆరోపణలు చేశారు. ఇది కేవలం ప్రమాదంగా కాకుండా ఓ కుట్రగా పరిగణించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. జల్‌పల్లిలోని ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ సౌందర్య, ఆమె సోదరలదని ఆరోపించారు. సౌందర్య మరణం తర్వాత మోహన్ బాబు ఆ ఆస్తిని అక్రమంగా అనుభవిస్తున్నారని.. ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా జల్‌పల్లిలోని ఈ స్థలం గురించే మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాపర్టీ తమకే చెందుతుందంటూ ఇద్దరు ఒకరిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌందర్య మరణానికి సంబంధించి మోహన్ బాబుపై ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సంచలన ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.