Thursday, December 12, 2024
Homeచిత్ర ప్రభMohanBabu: జర్నలిస్టుపై దాడి.. మోహన్‌ బాబుపై కేసు నమోదు

MohanBabu: జర్నలిస్టుపై దాడి.. మోహన్‌ బాబుపై కేసు నమోదు

MohanBabu| మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో శంషాబాద్ ప్రాంతంలోని జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసానికి కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులు వెళ్లారు. దీంతో మోహన్‌ బాబుతో పాటు ఆయన బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఓ ఛానల్‌ ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కుని ముఖంపై బలంగా కొట్టారు. అనంతరం బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానల్‌ కెమెరామన్‌ కింద పడ్డాడు. మోహన్ బాబు చేసిన దాడిలో సదరు జర్నలిస్టు తలకు తీవ్ర గాయాలయ్యాయి.

- Advertisement -

దవడ పైభాగంలో ఉండే జైగోమాటిక్ బోన్(Zygomatic Bone) మూడు చోట్ల విరిగినట్లుగా స్కానింగ్‌లో తేలిందని వైద్యులు తెలిపారు. దీంతో రంజిత్‌కు వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడిని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 118 బి ఎం ఎస్ కింద రాచకొండ పోలీసులు హత్యాతయ్నం కేసు నమోదుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News