Friday, December 13, 2024
Homeచిత్ర ప్రభMohanBabu: హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్

MohanBabu: హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్

MohanBabu| మంచు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనకు పోలీసులు జారీ చేసిన నోటీసులను ఆయన తెలంగాణ హైకోర్టు(TG HighCourt)లో సవాల్ చేశారు. ఈమేరకు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తనకు సెక్యూరిటీ కల్పించాలని కోరినా పోలీసులు కల్పించలేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

కాగా మంగళవారం రాత్రి ఆయన నివాసానికి కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సదరు జర్నలిస్టు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మోహన్ బాబుపై రాచకొండ పోలీసులకు జర్నలిస్టులు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదుతో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు బుధవారం తన ఎదుట విచారణకు హాజరుకావాలని రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మరోవైపు మీడియాపై దాడి విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మోహన్ బాబు ఇంటి చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News