Bha Bha Ba Movie Review: ‘భ భ బ’ అనేది మలయాళ యాక్షన్-కామెడీ స్పూఫ్ సినిమా. దిలీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జనవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజకీయ సెటైర్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, స్పూఫ్ ఎలిమెంట్స్ కలిగిన ఈ సినిమాలో మోహన్‌లాల్ కేమియో చేశారు.
కథ
కొత్తగా ఎన్నికైన కేరళ ముఖ్యమంత్రి సీ.కె. జోసెఫ్ (బైజు సంతోష్) ప్రసంగం సమయంలో బహిరంగంగా కిడ్నాప్‌కు గురవుతాడు. కిడ్నాపర్ తనను “కామన్ మ్యాన్” లేదా “ది కామనర్” అని పరిచయం చేసుకుంటాడు. పౌరులందరూ తమ ఫిర్యాదులు రాసి పంపాలని, తను వాటిని సీఎంకు చేరవేస్తానని ప్రకటిస్తాడు. ఇది రాజకీయ నాయకులు, పోలీసులు, మీడియాలో గందరగోళం సృష్టిస్తుంది. సీఎం కుమారుడు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్‌ఐఏ ఏజెంట్‌గా దర్యాప్తు చేస్తాడు. కిడ్నాపర్ రాజా దామోదర్ అలియాస్ రాడార్ (దిలీప్) అని తేలుతుంది. అతనికి జోసెఫ్‌తో పాత శత్రుత్వం, ప్రతీకారం ఉంది. మధ్యలో పేరుపొందిన గ్యాంగ్‌స్టర్ ఘిల్లీ బాల (మోహన్‌లాల్) కూడా ఎంట్రీ ఇస్తాడు. ఈ కిడ్నాప్ వ్యవహారం ఏమయ్యిందనేది మిగతా కథ.
కథనం
సినిమా మొదలైన వెంటనే బాంబు పేలినట్టు హుక్ ఇస్తుంది – సీఎం కిడ్నాప్ సీక్వెన్స్ సూపర్ ఎనర్జిటిగ్గా అనిపిస్తుంది. డైరెక్టర్ ధనంజయ్ శంకర్‌కి ఇది డెబ్యూ ఫిల్మ్. అయినప్పటికీ ఈ మాస్ స్పూఫ్ స్టైల్‌ని బాగా హ్యాండిల్ చేశాడు. ఫస్టాఫ్‌లో కామెడీ, సిట్యువేషనల్ హ్యూమర్, స్లాప్‌స్టిక్ జోక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పాత మలయాళ సినిమాల రిఫరెన్స్‌లు (ఆరాట్టు, జీబీయూ వంటివి) చాలా ఉన్నాయి. ఫ్యాన్స్‌కి నాస్టాల్జియా ఫీలింగ్ ఇస్తాయి. కానీ సెకండాఫ్‌లో కథ కొంచెం ఓవర్ లోడ్ అవుతుంది. లాజిక్ గ్యాప్స్, అనవసర ఎమోషనల్ ట్రాక్, స్పూఫ్ ఎలిమెంట్స్ బలహీనంగా మారిపోతాయి. కొన్ని సీన్స్ ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా కిడ్నాప్ సీక్వెన్స్‌లో కొన్ని నిజ ఘటనల్ని స్పూఫ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా ఇన్వాల్వ్ కాలేరు. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ బ్లాక్స్, ఫైట్ సీన్స్ బాగున్నాయి కానీ స్క్రీన్‌ప్లే బలహీనత వల్ల మొత్తం ప్రభావం తగ్గిపోతుంది. మోహన్‌లాల్ కేమియో సూపర్ హైప్ తెస్తుంది కానీ అది కూడా స్టోరీని సేవ్ చేయలేదు. మొత్తంగా బాగా స్టార్ట్ అయిన సినిమా మధ్యలో డౌన్ అవుతుంది. చివరికి మిక్స్‌డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డైలాగ్స్, టైమింగ్‌లో కామెడీ హైలైట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ స్క్రిప్ట్ బలహీనం. ఫ్యాన్స్ కోసం మాస్ ఎంటర్‌టైనర్‌గా చూడొచ్చు కానీ లాజిక్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మిగిలేది నిరాశే.
నటీనటుల అభినయం
దీలీప్ ఈ సినిమాలో పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ మోడ్‌లో కనిపించాడు. కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, యాక్షన్ అన్నీ బాగా సూట్ అయ్యాయి. అతని ఫ్యాన్స్ ఈ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు. వినీత్ శ్రీనివాసన్ కమిషనర్ పాత్రలో సీరియస్‌నెస్‌నీ, కామెడీనీ బాగా బ్యాలెన్స్ చేశాడు. అతని రియాక్షన్స్ సూపర్బ్. సీఎం పాత్రలో బైజు సంతోష్ బాగా ఫిట్ అయ్యాడు. అతని ఫియర్, కామెడీ బాగున్నాయి. మోహన్‌లాల్ కేమియో చిన్నదే అయినా సూపర్బ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను లెవెల్ అప్ చేశాడు – ఆయన ఎంట్రీ సీన్ హైలైట్. ధ్యాన్ శ్రీనివాసన్, బాలు వర్గీస్, శరణ్య పొన్‌వణ్ణన్, రెడిన్ కింగ్‌స్లే వంటి సపోర్టింగ్ యాక్టర్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తంగా కాస్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా దిలీప్, మోహన్‌లాల్ కాంబినేషన్ ఫ్యాన్స్‌కి ట్రీట్. కానీ కొన్ని పాత్రలు ఓవర్ యాక్టింగ్‌తో చికాకు పుట్టించాయి. సపోర్టింగ్ యాక్టర్స్ ద్వారా వచ్చే కామెడీ మంచి టచ్ ఇచ్చింది.
సాంకేతిక అంశాలు
సినిమాటోగ్రఫీ బాగుంది. మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు డైనమిక్. ఫైట్ కొరియోగ్రఫీ ఎనర్జిటిక్. స్పెషల్ ఎఫెక్ట్స్ మెరుగ్గా ఉన్నాయి కానీ కొన్ని చోట్ల బడ్జెట్ లిమిటేషన్స్ కనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాస్ ఫీల్ ఇవ్వడంలో సక్సెస్ అయింది, ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో. స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటం వల్ల ఎడిటింగ్ కూడా కొంచెం డ్రాగ్ అనిపించింది. ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. మ్యూజిక్ సాధారణ స్థాయిలో ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. మొత్తంగా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ బాగుంది కానీ స్క్రిప్ట్ బలహీనత వల్ల పూర్తి ప్రభావం కనిపించదు.
తెలుగుప్రభ వర్డిక్ట్
మాస్ ఫ్యాన్స్, దిలీప్ & మోహన్‌లాల్‌ని అభిమానించేవాళ్లకు టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్. కానీ లాజిక్, ఎమోషన్ లేకపోవడంతో మిక్స్‌డ్ బ్యాగ్. స్పూఫ్ కామెడీ ఎంజాయ్ చేయాలంటే ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
– యజ్ఞమూర్తి

