ప్రస్తుతం ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ సమస్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య గురించి ప్రధాని మోదీ(PM Modi) ఇటీవల ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారని.. దీన్ని అధిగమించేందుకు వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ పది మంది ప్రముఖులను మోదీ నామినేట్ చేశారు. అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) కూడా ఉన్నారు.
తాజాగా తన పేరును నామినేట్ చేసినందుకు మోదీకి ధన్యవాదాలు మోహన్ లాల్ ధన్యవాదాలు తెలిపారు. హెల్దీ ఇండియాను నిర్మిద్దామంటూ 10 మంది సినీ ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం అంటూ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఉన్ని ముకుందన్, టొవినో థామస్, మంజు వారియర్, కల్యాణి ప్రియదర్శన్, దర్శకుడు రవి, ప్రియదర్శన్‌లకు ఆయన పిలుపునిచ్చారు.