ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పూసలు అమ్మేందుకు వచ్చిన మోనాలిసా(Monalisa) అనే యువతి వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి, తేనే కళ్లకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమె ఓవర్‌నైట్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమెను చూసేందుకు యువత ఎగబడటంతో స్వస్థలానికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా అవకాశాలు ఇస్తామంటూ ఆఫర్లు కూడా వస్తున్నాయి. తాజాగా సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ స్వయంగా మధ్యప్రదేశ్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లి మూవీ ఆఫర్ ఇచ్చారు.
దర్శకుడితో మాట్లాడిన తరువాత మోనాలిసా కుటుంబం ఆమె నటించేందుకు ఒప్పుకుంది. ‘డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో నటించనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి మరో నెలరోజుల సమయం ఉందని ఆలోపు మోనాలిసాకు యాక్టింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.ఈ సినిమాలో ఓ ఆర్మీ ఆఫీసర్ కూతురిగా మోనాలిసా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.