జైలు నుంచి విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నివాసంలో ఉన్నారు. దీంతో బన్నీని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ఆనంద్ దేవరకొండ తదితరులు బన్నీని కలిసిన వారిలో ఉన్నారు. కేసుకు సంబంధించిన విషయాలతో పాటు తాజా పరిణామాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా సుకుమార్(Sukumar) బన్నీని చూడగానే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వెంటనే బన్నీ ఆయన్ని ప్రేమగా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పోలీసులు బన్నీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను ఆయన నివాసంలో అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.