Mrunal Thakur: గత కొన్నాళ్లుగా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ బిపాసబసుపై మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. మృణాల్‌ను ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. దాంతో ఓ మెట్టు దిగిన మృణాల్ తప్పు చేశానని ఒప్పుకుంది. కెరీర్ ఆరంభంలో తెలిసి తెలియక ఏదో మాట్లాడానంటూ క్షమాపణలు చెప్పింది. ఈ వివాదం పూర్తిగా సద్ధుమణగక ముందే మరోసారి నోరుజారింది మృణాల్. ఈ సారి ఏకంగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మపైనే విమర్శలు గుప్పించింది.
సినిమాలు మానేసింది…
రీసెంట్ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. చాలా రోజుల క్రితం బాలీవుడ్‌లో ఓ సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశానని చెప్పింది. ఒకవేళ తాను అప్పుడు ఆ సినిమా చేసుంటే ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉండేదాన్నని అన్నది. తన ప్లేస్‌లో మరో హీరోయిన్ ఆ సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్‌గా నటించిందని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నది. సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ హీరోయిన్‌కు స్టార్‌డమ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె సినిమాలు చేయడం లేదు అని మృణాల్ ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. స్టార్ హీరో సినిమా ఏది, ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం మృణాల్ రివీల్ చేయలేదు.
Also Read – Viral Fevers: వణికిస్తున్న విషజ్వరాలు..పెరుగుతున్న కేసులు
సుల్తాన్ సినిమా…
మృణాల్ కామెంట్స్ చేసింది విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మపైనే అని నెటిజన్లు అంటున్నారు. మృణాల్ చెప్పిన ఆ సినిమా సల్మాన్ ఖాన్ సుల్తాన్ అంటూ పేర్కొంటున్నారు. అనుష్క శర్మను అవమానించాలనే ఉద్దేశంతోనే కావాలనే మృణాల్ ఠాకూర్ చీప్ కామెంట్స్ చేసిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అవకాశాలు లేక కాదు..
అనుష్క శర్మకు అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉండటం లేదని, కుటుంబం కోసం సినిమాలను వదిలేసిందని అంటున్నారు. విరాట్ కోహ్లిని పెళ్లిచేసుకొని భర్త, పిల్లలతో అనుష్క శర్మ సంతోషంగా ఉందని చెబుతున్నారు. కానీ నువ్వు మాత్రం డేటింగ్‌ల పేరుతో హీరోలతో తిరుగుతున్నావంటూ మృణాల్‌ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. పెద్ద హీరోయిన్‌లా ఫీలవ్వద్దంటూ ట్రోల్ చేస్తున్నారు. నీ గొప్పల కోసం మరొకరిని తక్కువ చేయడం ఇకనైనా మానేస్తే మంచిదంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై మృణాల్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో డెకాయిట్ సినిమా చేస్తోంది. అడివి శేష్‌హీరోగా నటిస్తున్న లవ్ రివేంజ్ థ్రిల్లర్‌మూవీ 2025 డిసెంబర్25 న రిలీజ్ కాబోతుంది.
Also Read – Vijay-Rashmika: మొత్తానికి ఇప్పుడు కుదిరింది..

