Homeచిత్ర ప్రభMugguru kothulu: ‘ముగ్గురు కోతులు’ లవ్ సాంగ్ ‘తిడుతున్నా కొడుతున్నా’ 

Mugguru kothulu: ‘ముగ్గురు కోతులు’ లవ్ సాంగ్ ‘తిడుతున్నా కొడుతున్నా’ 

తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో…వర్షిక పాశం హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆకట్టుకోగా…ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్‌ మెప్పించింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా “తిడుతున్నా కొడుతున్నా” అనే పాటను రిలీజ్ చేశారు. ఎస్. సుహాస్ బాణీ, జగదీష్ సాహిత్యంతో పాటుగా చైతన్య, లాస్య గాత్రం ఈ పాటను వినసొంపుగా మార్చాయి. ఇక ఈ లిరికల్ వీడియోని గమనిస్తే హీరో, హీరోయిన్.. లవ్ ట్రాక్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎస్. సుహాస్ సంగీతాన్ని, రాజ్ నోముల సినిమాటోగ్రఫీని అందిస్తుండగా…జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లను అందిస్తామని టీమ్ ఈ సందర్భంగా తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News