Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభThaman: నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి.. థమన్ ఎమోషనల్ ట్వీట్

Thaman: నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి.. థమన్ ఎమోషనల్ ట్వీట్

ప్రముఖ సంగీత దర్శకుడు థమన్(Thaman) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు తమిళ సినిమాలకు సంగీతం అందిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక తెలుగులో అయితే క్రేజీ ప్రాజెక్టులకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

- Advertisement -

దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar)ను గుర్తుచేసుకుంటూ.. ‘నువ్వు మమ్మల్ని ఎలా వదిలేస్తావు అన్నా.. మేము నిన్ను కోల్పోయాం మా ప్రియమైన పునీత్ రాజ్‌కుమార్ అన్నా. చాలా మంచి స్నేహితుడు. బ్రదర్ నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నిన్ను కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు.. లవ్ యు అప్పు అన్న.. మీరు సమాజానికి, ప్రజలకు చేసిన మేలు మాటల్లో చెప్పలేము. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో బతికే ఉంటారు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. కాగా పునీత్ రాజ్‌కుమార్ 46 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News