Naga Chaitanya emotional post: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య, నటి శోభిత ధూళిపాళ్లకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మే 31 శోభిత బర్త్‌డే కావడంతో.. చైతన్య ఆమెతో కలిసి దిగిన కొన్ని అన్‌సీన్ బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలతో పాటు ఆయన పెట్టిన లవ్లీ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే మై లేడీ శోభిత.. నీతో కలిసి నా జీవితాన్ని పంచుకునే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.” అంటూ హార్ట్ ఎమోజీని జోడించి చైతన్య తన ప్రేమను వ్యక్తం చేశారు. నాగ చైతన్య షేర్ చేసిన ఫోటోల్లో శోభితకు సంబంధించిన కొన్ని క్యాండిడ్ పిక్స్‌తో పాటు, వారిద్దరూ కలిసి సరదాగా దిగిన సెల్ఫీలు కూడా ఉన్నాయి. ఒక ఫోటోలో శోభిత కొండ అంచున నిలబడి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించింది. వారిద్దరి మధ్య అన్యోన్న దాంపత్యాన్ని తెలియజేస్తున్న ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.
2017లో సమంతతో విహాహం.. ఆ తర్వాత డైవర్స్..
నాగచైతన్య, శోభితలు కొంతకాలం డేటింగ్‌లో ఉన్న తర్వాత.. 2024 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరూ ఘనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కాగా, శోభిత కంటే ముందు నాగచైతన్య నటి సమంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్యంత ఘనంగా 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ల తమ వైవాహిక బంధానికి పుల్‌స్టాప్ పెట్టింది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే మైథికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రాజస్థాన్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించగా, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, సీజీఐ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.

